లోక్‌సభ సమావేశాలపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి

ABN , First Publish Date - 2021-08-11T23:32:07+05:30 IST

లోక్‌సభ సమావేశాలపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి

లోక్‌సభ సమావేశాలపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు ఆశించిన స్థాయిలో జరగడంలేదని స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు సభ కార్యకలాపాలకు తరుచూ అడ్డుపడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అవసరమైతే వారితో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుధవారం పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘నేను ఊహించిన అంచనాల మేరకు లోక్‌సభ సమావేశాలు కొనసాగడం లేదు. గడిచిన రెండేళ్లలో అనుకున్నదాని కంటే 122 శాతం ఫలితాలు సాధించగలిగాం. సభ హుందాగా కొనసాగేందుకు, ప్రజా ప్రయోజనాలు చర్చకు వచ్చేందుకు నేను అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాను. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశాలు అందుకు సహకరించడం లేదు. అవసరమైతే అన్ని పార్టీల ఎంపీలతో నేనే స్వయంగా మాట్లాడతాను. పార్లమెంటరీ విధానాలు, నియమాలకు అనుగుణంగా నడుచుకొమ్మని వారిని కోరతాను. ఎంపీలు అనుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నాను’’ అని ఓం బిర్లా అన్నారు.

Updated Date - 2021-08-11T23:32:07+05:30 IST