ఓఎల్‌ఎక్స్‌లో బైక్ కోసం డబ్బు కట్టి మోసపోయిన మహిళ

ABN , First Publish Date - 2021-03-25T15:08:50+05:30 IST

ద్విచక్ర వాహనం కొనుగోలు కోసం ఓఎల్‌ఎక్స్‌లో చూసి డబ్బు కట్టి

ఓఎల్‌ఎక్స్‌లో బైక్ కోసం డబ్బు కట్టి మోసపోయిన మహిళ

హైదరాబాద్/జీడిమెట్ల : ద్విచక్ర వాహనం కొనుగోలు కోసం ఓఎల్‌ఎక్స్‌లో చూసి డబ్బు కట్టి మోసపోయిన ఓ మహిళ జీడిమెట్ల పోలీ‌స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంజయ్‌గాంధీ నగర్‌కు చెందిన ఎం.అనిత ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేందుకు ఈ నెల 23న ఓఎల్‌ఎక్స్‌లో వెతికింది. నలుపు రంగు యాక్టివా (నెంబర్‌ను టీఎస్‌ 09 ఎఫ్‌ఎన్‌ 2400) నచ్చిందని తెలపడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. బంటి అనే వ్యక్తి బ్యాంకు ఖాతా నెంబర్‌ ఇచ్చి ముందుగా రూ.2వేలు వేయాలని తెలిపాడు. దీంతో ఆమె ఆ ఖాతాలో మొదట రూ. 2వేలు, అనంతరం రూ.18 వేలు, మళ్లీ రూ.11 వేలు,  మొత్తం రూ. 31 వేలు వేసింది. అనంతరం బంటికి ఫోన్‌ చేస్తే యాక్టివా కూకట్‌పల్లిలో ఉందని, బ్యాలెన్స్‌ కట్టి తీసుకోమని చెప్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Updated Date - 2021-03-25T15:08:50+05:30 IST