ఆలివ్‌ నూనె, తేనె కలిపిన నిమ్మరసం మంచిదేనా?

ABN , First Publish Date - 2021-09-17T17:25:32+05:30 IST

నాకు 45ఏళ్లు. ఏ ఆరోగ్య సమస్యలు లేవు. ఇటీవల ఆలీవ్‌ నూనె, తేనె, నిమ్మరసం కలిపి సేవించడం చాలా ఉపయోగకరమని తెలిసింది. మన రాష్ట్ర వాతావరణానికి ఈ మిశ్రమం ఎంత వరకు ఉపయోగకరం. ?

ఆలివ్‌ నూనె, తేనె కలిపిన నిమ్మరసం మంచిదేనా?

ఆంధ్రజ్యోతి(17-09-2021)

ప్రశ్న: నాకు 45ఏళ్లు. ఏ ఆరోగ్య సమస్యలు లేవు. ఇటీవల ఆలీవ్‌ నూనె, తేనె, నిమ్మరసం కలిపి సేవించడం చాలా ఉపయోగకరమని తెలిసింది. మన రాష్ట్ర వాతావరణానికి ఈ మిశ్రమం ఎంత వరకు ఉపయోగకరం. ?


- జహంగీరే షేక్‌, రాజమండ్రి.


డాక్టర్ సమాధానం: ఆలివ్‌ నూనె, నిమ్మరసం, తేనె... వీటికి విడివిడిగా వివిధ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆలివ్‌ నూనెలో అధికంగా ఉండే మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా ఆలివ్‌ నూనెను వాడడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీరంలో ఇన్ఫ్లెమేషన్‌ తగ్గుతుంది, మెదడు చురుకుదనాన్ని రక్షించుకోవచ్చు. నిమ్మరసంలో విటమిన్‌- సి రోగనిరోధక వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తూ, చర్మం, గోళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తేనె శక్తినివ్వడమేకాక, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ మూడింటి మిశ్రమాన్ని కొద్ది మోతాదులో తీసుకుంటే పై ప్రయోజనాలని పొందవచ్చు. అయితే, ఆలివ్‌ నూనె, తేనె రెండూ అధిక కెలోరీలను కలిగి ఉండేవి. కాబట్టి మోతాదు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తేనె అధికంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజు పెరుగుతుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-09-17T17:25:32+05:30 IST