Advertisement
Advertisement
Abn logo
Advertisement

వృద్ధురాలి హత్య

సీతానగరం, నవంబరు 26: వంగలపూడి గ్రామంలో వృ ద్ధురాలి హత్య సంచలనం రేకెత్తించింది. పోలీసులు అం దించిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన కోడెల్లి నాగమణి (70) ఒంటరిగా ఉం టోంది. ఆమెకు వేరే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆమె హత్యకు గురైంది. హంతకుడు కత్తితో గాయపర్చి హత్య చేసినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తన తల్లితో పరిచయం ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డాడని నాగమణి కుమారుడు నాగేశ్వరరావు ఆరోపించాడు. నాగమణికు రెండు వివాహాలు జరిగాయి. మొదటి భర్తతో ఉండగా కుమారుడు వెంకటేష్‌ జన్మించాడు. అతడు పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేలచింతలగూడానికి దత్తత వెళ్లాడు. రెండో భర్త వీరయ్యతో ఉండగా రెండో కుమారుడు నాగేశ్వరరావు జన్మించాడు. అతను రాజమహేద్రవరంలో కోళ్లఫారమ్‌ వద్ద పనిచేస్తున్నాడు.  నాగమణి ఒంటరిగా వంగలపూడిలోనే ఉంటోంది. గురువారం రాత్రి 8 గంటలకు ఆమె పక్క వీధిలో పాల కోసం వెళ్లిందని స్థానికులు అంటున్నారు. శుక్రవారం ఉదయం 6.30కు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో పక్కనే నివాసం ఉంటున్నవారు చూడగా మంచంపై చనిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సింగవరానికి చెందిన వ్యక్తి తన తల్లిని ఇబ్బంది పెడుతున్నాడని, నాలుగు రోజుల క్రితం ఈ విషయాన్ని ఆమె స్వయంగా తనకు ఫోన్‌ చేసి చెప్పిందని, అతనే తన తల్లిని చంపాడని రెండో కుమారుడు నాగేశ్వరరావు ఆరోపించాడు. నార్త్‌జోన్‌ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, కోరుకొండ సీఐ పవన్‌ కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ శుభశేఖర్‌ సంఘటనా స్థలానికి  చేరుకుని పరిసరాలను, మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించారు.  డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాగమణి తల, ముక్కు, కుడిచేతిపై గాయాలు ఉన్నాయని, కర్ర లేదా కత్తితో గాయపరిచినట్లుగా అవి ఉన్నాయన్నారు.  సమీప బంధువు ఘంటసాల కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement