Abn logo
May 14 2021 @ 09:34AM

వృద్ధురాలి మృతదేహానికి పంచాయతీ దహన సంస్కారాలు

ఎ.కొండూరు: కరోనా భయంతో వృద్ధురాలి దహన సంస్కారాలకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవటంతో ఎ.కొండూరు తహసీల్దార్‌, సచివాలయ సిబ్బంది అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో గురువారం షేక్‌ సుభాన్‌భీ (62) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె బంధువులు ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఉన్నారు. కరోనా భయంతో వారు దహన సంస్కారాలకు రాలేదు. దీంతో తహసీల్దార్‌ గడ్డం బాలకృష్ణారెడ్డి, సర్పంచ్‌ శీతయ్య, ఎంపీటీసీ అభ్యర్థి గుంటక శివారెడ్డి, సచివాలయ కార్యదర్శి ఎం. నాగబాబు కొందరు గ్రామస్థుల సహకారంతో పీపీఈ కిట్స్‌, మాస్కులు, గ్లౌజులు ధరించి మృతదేహానికి అంతమ సంస్కారాలు నిర్వహించారు. వారికి ప్రజలు అభినందలు తెలిపారు.

Advertisement