పొలాల్లో ప్రాచీన విగ్రహాలు.. మిస్టరీ ఏంటి?

ABN , First Publish Date - 2020-07-14T00:24:06+05:30 IST

పొలాల్లో దున్నిన కొద్ది పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయి. ఒకదానివెంటే మరో విగ్రహం బయటకు..

పొలాల్లో ప్రాచీన విగ్రహాలు.. మిస్టరీ ఏంటి?

పొలాల్లో దున్నిన కొద్ది పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయి. ఒకదానివెంటే మరో విగ్రహం బయటకు వస్తోంది. అసలు ఆ విగ్రహాలు ఎక్కడివి. వరుస విగ్రహాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?. వాటిపై పరిశోధనలు చేస్తే ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. 


కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం నర్సింహులు పల్లె గ్రామంలోని ఓ రైతు భూమిలో పురాతన విగ్రహాలు లభించాయి. అవి వర్థమాన మహావీరుడు ఏడుపడగలు ఉన్న పార్శనాథుడి విగ్రహాలని అధికారులు తెలిపారు. అవి 8వ శతాబ్ధానికి చెందినవిగా భావిస్తున్నారు. నర్సింహులపల్లి గ్రామంలో భూములు దున్నుతుండగా వరుసగా విగ్రహాలు బయటపడుతున్నాయి. ఈ విగ్రహాలు వెలుగు చూసిన రెండు రోజులకు పక్కనే ఉన్న ఇంకో పొలంలో శిథిలమైన దేవీ విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాలకు గ్రామస్తులు పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-07-14T00:24:06+05:30 IST