అన్నవరం, నవంబరు 28: కార్తీకమాసం సందర్భంగా రత్నగిరిపై 65 ఏళ్లు దాటిన వారిని, పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం నిషే ధించారు. కొవిడ్ నివారణలో భాగంగా దేవదాయశాఖ కమిషనరు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈవో త్రినాథరావు తెలిపారు. వివిధ సేవలు, దర్శనాలకు సంబంధించి భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలని కోరారు