గార్గేయ నదిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-24T06:18:01+05:30 IST
సదుం వాల్మీకివీధికి చెందిన గంగయ్య(101) శనివారం ఉదయం స్థానిక గార్గేయ నది ప్రవాహంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సదుం, అక్టోబరు 23: సదుం వాల్మీకివీధికి చెందిన గంగయ్య(101) శనివారం ఉదయం స్థానిక గార్గేయ నది ప్రవాహంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోని వ్యక్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ధరణిధర్ ఆధ్వర్యంలో పోలీసులు, పీలేరు అగ్నిమాపక సిబ్బంది, కుటుంబసభ్యులు గంగయ్య కోసం ముమ్మరంగా గాలించారు. సాయంత్రం అయినా మృతదేహం లభ్యం కాలేదు. ఆదివారం మళ్లీ గాలింపు చేపట్టనున్నారు.