కారు ఢీ కొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-10-26T03:55:59+05:30 IST

పట్టణంలోని భరత్‌నగర్‌ సమీపంలో సోమవారం మోటారు సైకిల్‌ను కారు ఢీ కొన్న సంఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కారు ఢీ కొని వృద్ధుడికి తీవ్ర గాయాలు
తీవ్రగాయాలపాలైన పోలయ్య

నాయుడుపేట టౌన్‌, అక్టోబరు 25 : పట్టణంలోని భరత్‌నగర్‌ సమీపంలో సోమవారం మోటారు సైకిల్‌ను కారు ఢీ కొన్న సంఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణంలోని తుమ్మూరుకు చెందిన వృద్ధుడు పోలయ్య మోటారు సైకిల్‌పై నాయుడుపేటకు వస్తుండగా వెనుక వైపు నుంచి కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  తీవ్రంగా గాయపడ్డ పోలయ్యను 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-10-26T03:55:59+05:30 IST