Abn logo
Nov 29 2020 @ 01:15AM

చలిగాలులకు వృద్ధుడు మృతి

చీమకుర్తి, నవంబరు 28: నివర్‌ తు ఫాన్‌ ప్రభావంతో వీచిన చలి గాలుల కు పట్టణంలోని క్రిస్టియన్‌పాలెంకు చెందిన మందా యలమంద(65) శని వారం మృతిచెందాడు. సరైన గృహ వసతి లేక, చలిగాలులకు తట్టుకోలేక పక్కనే నిరుపయోగంగా ఉన్న బాత్‌ రూంలో నిద్రించిన యలమంద తెల్లా రేసరికి విగతజీవిగా పడి ఉండటం చుట్టుపక్కల వారిని కలచివేసింది. విషయం తెలుసుకున్న శివం ఫౌండే షన్‌ ప్రతినిధులు మృతుని కుటుంబా న్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని తహసీల్దార్‌ పిన్నిక మధుసూదనరావు చేతులమీదుగా అందజేశారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి సరైన నివాసం లేదు. కార్యక్రమంలో గొల్లపూడి హరి, పయ్యావుల రాజా, పాటిబండ్ల గంగయ్య, తప్పెట బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement