అల్లుడితో మాట్లాడేందుకు వచ్చిన మావయ్య.. వీపు మీద కొట్టడంతో అక్కడే పడిపోయి..

ABN , First Publish Date - 2022-04-06T08:27:51+05:30 IST

పెళ్లయిన తర్వాత కూడా కూతురు పుట్టింట్లోనే ఉండటంతో ఆ తండ్రి వేదన చెందాడు. ఎలాగైనా ఆమెను భర్తతో కలపాలని అనుకున్నాడు. దీని గురించి మాట్లాడేందుకు అల్లుడి ఇంటికి వచ్చాడు. అయితే అక్కడ తన వియ్యంకుడు, అల్లుడు, మరికొంత మంది కుటుంబ సభ్యుల...

అల్లుడితో మాట్లాడేందుకు వచ్చిన మావయ్య.. వీపు మీద కొట్టడంతో అక్కడే పడిపోయి..

పెళ్లయిన తర్వాత కూడా కూతురు పుట్టింట్లోనే ఉండటంతో ఆ తండ్రి వేదన చెందాడు. ఎలాగైనా ఆమెను భర్తతో కలపాలని అనుకున్నాడు. దీని గురించి మాట్లాడేందుకు అల్లుడి ఇంటికి వచ్చాడు. అయితే అక్కడ తన వియ్యంకుడు, అల్లుడు, మరికొంత మంది కుటుంబ సభ్యుల మాటలు ఆయనకు నచ్చలేదు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అల్లుడి కుటుంబంలో ఎవరో ఆయన వీపుపై బలంగా కొట్టారు. 


అసలే అనారోగ్యంతో ఉన్న ఆయన అక్కడిక్కడే కూలబడి అచేతనంగా ఉండిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినా కూడా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆ ముసలాయన చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగు చూసింది. 


సంగరియా ప్రాంతంలో నివశించే చందన్ లుహార్ తన కుమార్తెను పుట్టింటికి పంపేసిన విషయం మాట్లాడేందుకు అల్లుడి ఇంటికి వచ్చాడు. తన వెంట కుమారుడు రణజీత్ లుహార్‌ను కూడా తీసుకెళ్లాడు. అల్లుడి ఇంటికి వెళ్లిన తర్వాత రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో చందన్ వీపుపై బలంగా కొట్టడంతో అతను కిందపడి మళ్లీ లేవలేదు. దీంతో భయపడిపోయిన ఆ కుటుంబ సభ్యులు చందన్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు చెప్పారు. దీంతో తమ బావ కుటుంబంపై చందన్ కుమారుడు హత్య కేసు పెట్టాడు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-06T08:27:51+05:30 IST