హైదరాబాద్: ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 4.44 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 69 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ రీపోలింగ్ కొనసాగుతోంది. క్విక్ రియాక్షన్ టీం అందుబాటులో ఉన్నారు. స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీ పోలీస్, ఆర్మ్ రిజర్వ్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం కనబరుస్తున్నారు. మరోవైపు 69 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను నగర అదనపు పోలీసు కమిషనర్ చాహర్ పరిశీలించారు.