ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీ ఐడీ కార్డు.. దశాబ్దాల నాటిదట.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ..

ABN , First Publish Date - 2021-12-16T01:09:18+05:30 IST

దశాబ్దాల కాలం నాటి ఐడీ కార్డు ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది ఉస్మానియా యూనివర్శిటీ వుమెన్స్ కాలేజీ జారీ చేసిన గుర్తింపు కార్డు.

ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీ ఐడీ కార్డు.. దశాబ్దాల నాటిదట.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ..

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఆధునిక సమాజంలో ఐడీ కార్డులు మన జీవితంలో ఓ భాగమైపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు ఇచ్చే ఐడీ కార్టులతో పాటూ ప్రభుత్వం జారీ చేసే పాన్, ఆధార్ వంటి ఐడీల గురించి మనకు తెలిసిందే. ఐడీ కార్డంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫొటో ముద్రించి ఉన్న ఓ ప్లాస్టిక్ కార్డు. కొన్ని సందర్భాల్లో బయోమెట్రిక్ ఆధారిత ఐడీలను కూడా మనం చూస్తుంటాం. మరి.. దశాబ్దాల క్రితం పరిస్థితి ఎలా ఉండేది..? అప్పటి ఐడీ కార్డులు ఏలా ఉండేవి..? అనే సందేహాలు మనలో చాలా మందికి కలిగే ఉంటాయి. కానీ.. ఏ కొందరికో మాత్రమే వీటికి సమాధానాలు లభించి ఉంటాయి.  


అయితే.. దశాబ్దాల కాలం నాటి ఐడీ కార్డు ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది  ఉస్మానియా యూనివర్శిటీ ఉమెన్స్ కాలేజీ జారీ చేసిన గుర్తింపు కార్డు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న కార్డుపై హిందీ అక్షరం ‘ఊ’తో పాటూ ‘ఐన్’ అనే ఉచ్ఛారణ కలిగిన ఉర్దూ అక్షరం పక్కపక్కనే ఉన్నాయి. ఈ రెండు కలిపి చదివితే ఒస్మానియా ఆంగ్ల పదంలోని మొదటి అక్షరం ఉచ్ఛారణ వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా.. చివరి నిజామ్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరుకూ ఇది సంకేతమని చెబుతున్నారు. 1953లో ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న వహీదుద్దీన్ అహ్మద్ సోషల్ మీడియాలో ఈ విషయాలను షేర్ చేశారు. అయితే.. ఈ ఐడీపై ముద్రించిన వలయంలో ఉన్న పూలు ఏ జాతికి చెందినవో తెలియక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2021-12-16T01:09:18+05:30 IST