ఎలక్ట్రికల్ వాహన తయారీ సంస్థను నెలకొల్పనున్న ఓలా.. ప్రపంచంలోనే..

ABN , First Publish Date - 2021-03-08T23:08:54+05:30 IST

ప్రముఖ వాహన సేవల సంస్థ ఓలా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థను నెలకొల్పబోతోంది. బెంగళూరు శివార్లలోని 500 ఏకరాల స్థలంలో ఈ ప్లాంట్‌ను నెలకొల్పబోతోంది. దీని కోసం ఏకంగా ..

ఎలక్ట్రికల్ వాహన తయారీ సంస్థను నెలకొల్పనున్న ఓలా.. ప్రపంచంలోనే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వాహన సేవల సంస్థ ఓలా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థను నెలకొల్పబోతోంది. బెంగళూరు శివార్లలోని 500 ఏకరాల స్థలంలో ఈ ప్లాంట్‌ను నెలకొల్పబోతోంది. దీని కోసం ఏకంగా 330 మిలియన్ డాలర్లు(రూ.241 కోట్లు పైగా) సదరు సంస్థ ఖర్చు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ పూర్తయితే దీని ద్వారా 2022 వేసవిలోగా ప్రతి ఏడాది కోటి ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేయాలని, అంటే ప్రపంచంలో తయారయ్యే మొత్తం ఎలక్టిక్ స్కూటర్లలో 15 శాతం తయారు చేయాలని ఓలా భావిస్తోంది. అంటే ప్రతి రెండు సెకండ్లకు ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ తయారవుతుందన్నమాట. దీనిపై ఓలా ఫౌండర్ భవిష్ అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమ ఫ్యాక్టరీ ప్రపంచ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో భారత్ పేరు కూడా నిలుపుతుందనే నమ్మకం తమకుందని అన్నారు. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాణించేందుకు భారత కంపెనీల వద్ద శక్తి, నైపుణ్యాలు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు.

Updated Date - 2021-03-08T23:08:54+05:30 IST