ఒక్కసారి చార్జింగ్‌తో 500 కి.మీ ప్రయాణం

ABN , First Publish Date - 2022-08-16T06:23:15+05:30 IST

ఇప్పటికే ఈ-స్కూటర్లను విక్రయిస్తోన్న ఆన్‌లైన్‌ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా.. ఇక ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకీ ప్రవేశించబోతోంది. కంపెనీ తొలి ఎలక్ట్రిక్‌ కారును స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆవిష్కరించింది. ఓలా ఎలక్ట్రిక్‌ కారు ఒక్కసారి చార్జింగ్‌తో 500..

ఒక్కసారి చార్జింగ్‌తో 500 కి.మీ ప్రయాణం

తొలి ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించిన ఓలా 

2024లో మార్కెట్లోకి విడుదల.. రూ.50 లక్షల స్థాయిలో ధర!  


న్యూఢిల్లీ: ఇప్పటికే ఈ-స్కూటర్లను విక్రయిస్తోన్న ఆన్‌లైన్‌ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా.. ఇక ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకీ ప్రవేశించబోతోంది. కంపెనీ తొలి ఎలక్ట్రిక్‌ కారును స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆవిష్కరించింది. ఓలా ఎలక్ట్రిక్‌ కారు ఒక్కసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. అంతేకాదు, గంటకు సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. ఈ కారు 2024లో మార్కెట్లోకి విడుదల కానుంది. దేశంలో బెస్ట్‌ స్పోర్టియెస్ట్‌ కారు కానుందని ఓలా సీఈఓ భవిశ్‌ అగర్వాల్‌ అన్నారు. అసిస్టెడ్‌ డ్రైవ్‌ టెక్నాలజీ, ఆల్‌ గ్లాస్‌ రూఫ్‌, కీ లెస్‌ ఆపరేషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఆయన తెలిపారు. ప్రీమియం హంగులతో కూడిన ఈ కారు ధర రూ.50 లక్షల వరకు ఉండవచ్చని అగర్వాల్‌ సంకేతాలిచ్చారు. 

Updated Date - 2022-08-16T06:23:15+05:30 IST