న్యూఢిల్లీ: ఇండియన్ మల్టీనేషనల్ రైడ్‌షేరింగ్ కంపెనీ ఓలా క్యాబ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని మళ్లీ ఆలస్యం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చిప్‌సెట్‌లు మరియు ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా ఓలా ఎస్1 డెలివరీకి కొన్ని అనివార్యమైన జాప్యాలు ఉన్నాయని కంపెనీ కొనుగోలుదారులకు ఇ-మెయిల్ పంపింది. డిసెంబరు 15 మరియు 30 మధ్య మొదటి బ్యాచ్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రెండు వారాల నుంచి ఒక నెల వరకు ఆలస్యం జరుగుతుందని కంపెనీ తెలిపింది.