బెండకాయ సూప్‌

ABN , First Publish Date - 2021-12-04T19:02:49+05:30 IST

బెండకాయలు - పన్నెండు, బీన్స్‌ - అరకప్పు, సొరకాయ ముక్కలు - ఒక కప్పు, క్యారెట్‌ - ఒకకప్పు, తరిగిన ఉల్లిపాయలు - అరకప్పు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - ఒకటి, నల్లమిరియాలు - ఒకటేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.

బెండకాయ సూప్‌

కావలసినవి: బెండకాయలు - పన్నెండు, బీన్స్‌ - అరకప్పు, సొరకాయ ముక్కలు - ఒక కప్పు, క్యారెట్‌ - ఒకకప్పు, తరిగిన ఉల్లిపాయలు - అరకప్పు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - ఒకటి, నల్లమిరియాలు - ఒకటేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం: ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, తడిలేకుండా ఆరిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. సొరకాయముక్కలు, క్యారెట్‌, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, బీన్స్‌ను కుక్కర్‌లో వేసి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పోయిన తరువాత కుక్కర్‌ మూత తీసి పాత్రలోకి నీళ్లు వడగట్టాలి. ఆ నీళ్లలో మరో కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టి మరిగించాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తరువాత స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. మిరియాల పొడి చల్లుకుని వేడి వేడి సూప్‌ సిప్‌ చేయాలి.

Updated Date - 2021-12-04T19:02:49+05:30 IST