Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ..!

కన్నుల పండువగా పూల జాతర

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

కోలాటాలు, దాండియా నృత్యాలతో మహిళల సందడి

జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 14 : ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ.. ఒక్క జాములాయే చందమామ.. రామ రామరామ ఉయ్యాలో... రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ మహిళల పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఏ ఊరిలో చూసినా, ఏ వీధిలో చూసినా మహిళలు బతుకమ్మ ఉత్సవాలు ఆడుతూ, పాడుతూ కనిపించారు. మహిళలు, యువతులు, చిన్నారులు అనే తేడా లేకుండా అందరూ బతుకమ్మలను పేరించి వాడవాడలా బతుకమ్మ ఆడుతూ, పాడుతుండటంతో వీధులన్నీ పూల జాతరను తలపించాయి. ఓవైపు బతుకమ్మలు, మరోవైపు యువతుల కోలాటం, దాండియా నృత్యాలతో జిల్లా మొత్తం మారుమోగింది. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలకు పోటీ పడుతున్నట్లుగా మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుం చే మహిళలు బతుకమ్మ పేరుస్తూ కనిపించగా, సాయంత్రం లోగిళ్లన్నీ పూల వనాలతో నిండిపోయాయి. సాయంత్రం 5 నుంచి వీధుల్లో బతుకమ్మలను పేర్చి, మేళతాళాల మధ్య దాండియా నృత్యాలు చేశారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. జగిత్యాల టవర్‌ సర్కిల్‌తో పాటు మినీ స్టేడియంలో మహిళలు పెద్ద ఎత్తున చేరి, రాత్రి వరకు బతుకమ్మల వద్ద ఆడి, పాడిన మహిళలు, రాత్రి వాటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. జగిత్యాల పట్టణంలోని చింతకుంట, కండ్లపెల్లి, మోతె చెరువులతో పాటు గొల్లపల్లి రోడ్డులో ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు. ముందస్తుగా బల్దియా ఆధ్వర్యంలో వీధి దీపాలను అలంకరించారు.  మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ వాయనాలు ఇచ్చి పుచ్చుకోవడం కనిపించింది. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమా ర్‌, జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణితో పాటు జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత, అన్ని వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రథినిదులు, నాయకులు వేడుకల్లో పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాం క్షలు తెలియజేశారు.


ధర్మపురి : ధర్మపురి క్షేత్రంలో సద్దుల బతుకమ్మ  వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. క్షేత్రంలోని పలు వీధుల్లో మహిళలు, యువతులు, చిన్న పిల్లలు పాల్గొని ఆనందోత్సహాల మఽధ్య చివరి రోజున సద్దుల బతుకమ్మతో ముగించారు. క్షేత్రంలోని వివిధ వీధుల్లో మహిళలు, యువతులు, చిన్న పిల్లలు తమ ఇళ్లలో రక రకాల పూలతో అందంగా అలంకరించిన బతుక మ్మలపై గౌరీ దేవిని ప్రతిష్టించారు. సాయంత్రం వేళలో నూతన వస్త్రాలు ధరించిన మహిళలు, యువతులు నెత్తి మీద బ తుకమ్మలు పెట్టుకుని గోదావరి నది వరకు ఊరేగింపుగా వెళ్లారు.  తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట, గోదావరి నదీ తీరాన గల స్నానఘట్టాల సమీపంలో గల పోచమ్మ మైదానంలో బతుకమ్మ ఆటలు ఆడారు. రాత్రి వరకు వేలాది మంది మహిళలు, యువతులు, చిన్నారులు చల్లగా దీవిం చమ్మా అంటూ వేడుకుని బతుకమ్మలను గోదావరి నదిలో నిమ జ్జనం చేశారు. అనంతరం మహిళలు, యువతులు పరస్పర వయనాలు స్వీకరిం చారు. క్షేత్రంలో అన్ని వీధుల్లో, గోదావరి నది వద్ద పట్టణ పురపాలక సంఘం పక్షాన చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, కమిషనర్‌ రమేష్‌, మేనేజర్‌ సంపత్‌రెడ్డి, సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ధర్మపురి సీఐ బిళ్ల కోటేశ్వర్‌ నేతృత్వంలో ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో మంత్రి ఈశ్వర్‌ సతీమణి, ఎల్‌ఎం కొప్పుల చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షురాలు కొప్పుల స్నేహలత, నందిని, జడ్పీటీసీ బత్తిని అరుణ,  కౌన్సి లర్లు సంతోషి, జక్కు పద్మ, వేముల నాగలక్ష్మి, ఒడ్నాల ఉమాలక్ష్మి, కిరణ్మ యి, పద్మ, అరుణ, విజయలక్ష్మి, లక్ష్మీ నరసింహ ఫ్రెండ్స్‌ గ్రూపు కన్వీనర్‌ అక్కెనపెల్లి జయలక్ష్మి, వనిత క్లబ్‌ అధ్యక్షురాలు మత్యపు రాధిక, శారదా మహిళా మండలి అధ్యక్షురాలు మధ్వాచారి విజయలక్ష్మి, కార్యదర్శి శోభ, రమాదేవి, రాధిక పాల్గొన్నారు.

ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు

ధర్మపురి గోదావరి నది వద్ద 1981 ఎస్‌ఎస్‌సీ పూర్వపు విద్యార్థుల మిత్ర బృందం తరపున ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందిం చారు. ఆకర్షణీయంగా నిలిచిన 100 ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేశారు. అనంతరం విజేతలుగా నిలిచిన మహిళలు, యువతులకు బహుమతులు అందజేశారు.

 

రాయికల్‌, అక్టోబరు 14: రాయికల్‌ మండల కేంద్రంలో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బతుకమ్మను మహిళలు రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్యాలు చేస్తూ కోలాటాలు ఆడుతూ బతుకమ్మలను పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. కాగా మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, కమీషనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కౌన్సిలర్లు పెద్ద చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.Advertisement
Advertisement