సూపర్‌స్టార్ కెరీర్లో మరపురాని చిత్రం `ఒక్కడు`. గుణశేఖర్ దర్శకత్వంలో హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. 2003 జనవరి 15న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మహేష్‌ను స్టార్ హీరోను చేసింది. మహేష్, భూమిక, ప్రకాష్ రాజ్ నటన, మణిశర్మ సంగీతం, అన్నింటికీ మించి గుణశేఖర్ టేకింగ్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు.
ఈ సినిమా విడుదలై నేటితో (శుక్రవారం) 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రత `ఒక్కడు`ను సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు. మహేష్ సినిమాల్లో `ఒక్కడు` ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ అని, ఈ సినిమాను ఎన్ని సార్లైనా చూడొచ్చని పేర్కొన్నారు. అంతేకాదు `ఒక్కడు` తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అని కూడా నమ్రత తెలిపారు.