Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 11:04:50 IST

Oke Oka Jeevitham: ఆకట్టుకుంటున్న ‘ఒకటే కదా’ లిరికల్ వీడియో సాంగ్..

twitter-iconwatsapp-iconfb-icon

యంగ్ హీరో శర్వానంద్ (Sarwanand) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham). తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. యువ దర్శకుడు శ్రీకార్తిక్ (Srikarthik) తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుని మూవీపై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. ఇక సెప్టెంబర్ 9న ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను మెల్లగా స్టార్ట్ చేశారు.

దీనిలో భాగంగా ‘ఒకటే కదా’ అనే పల్లవితో సాగే  ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ మంచి మెలోడియస్‌గా సాగుతూ ఆకట్టుకుంటుంది. 


పరిగెడుతుంటే కాలమే 

మన బ్రతుకోచోటే ఆగింది కదరా.. 

త్రెడ్‌మిల్‌పై పరుగై

ఎగుడు దిగుడు దారిలో పడుతుండాలే లైఫే నేడు పదరా..




అని కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ సాంగ్‌ను గౌతమ్ భరద్వాజ్ పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇందులో రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా అక్కినేని అమల (Akkineni Amala) కీలక పాత్రను పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నాజ‌ర్‌, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో శర్వానంద్ ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోవడం లేదు. మరి ఒకే ఒక జీవితంతోనైనా హిట్ అందుకొని ఫాంలోకి వస్తాడేమో చూడాలి.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement