చేయూత సరే... రిజర్వేషన్ల సంగతేమిటి?

ABN , First Publish Date - 2021-02-25T05:00:55+05:30 IST

అగ్రవర్ణ పేద మహిళలకు ఈడబ్ల్యూఎస్‌ చేయూత అందించే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ప్రశ్నిం చారు.

చేయూత సరే... రిజర్వేషన్ల సంగతేమిటి?
వేంపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తులసిరెడ్డి

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి


వేంపల్లె, ఫిబ్రవరి 24: అగ్రవర్ణ పేద మహిళలకు ఈడబ్ల్యూఎస్‌ చేయూత అందించే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ప్రశ్నిం చారు. బుధవారం వేంపల్లెలో ఆయన మీడియాతో మాటా ్లడుతూ అగ్రవర్ణ పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కల్పిస్తూ భారత ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేసిందన్నారు. కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ అమలు చేసు ్తన్నాయన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం అమలు చేయడం లేదన్నారు. 


ఎన్నికల కోసమే అమరావతిపై ప్రేమ


రూ.3వేల కోట్లు అప్పుతెచ్చి అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి వర్గం నిర్ణయించడం ఎన్నికల స్టంటు మాత్రమే అని తులసిరెడ్డి అన్నారు. ఏరుదాటినంత వరకు ఓడమల్లన్న, దాటినాక బోడి మల్లన్న అనే నైజం వైసీపీ దన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉత్తన్న, రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:00:55+05:30 IST