Abn logo
Mar 8 2021 @ 15:41PM

`ఒక యువ‌త క‌థ‌` లోగో లాంచ్‌

ప్ర‌వీణ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సూర్య కుమారి వ‌ర్క్స్ ప‌తాకంపై శ్రీమ‌తి ఏలూరి సూర్య కుమారి నిర్మాత‌గా ఆప‌తి ప్ర‌వీణ్ కుమార్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఒక యువ‌త క‌థ‌`. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం లోగో లాంచ్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత‌లు తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్ చేతుల మీదుగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అతిథులుగా విచ్చేసిన త‌మ్మ‌‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ, ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ ``మ‌హిళా దినోత్స‌వం రోజున మ‌హిళా నిర్మాతగా తెర‌కెక్కుతోన్న `ఒక యువ‌త క‌థ‌` చిత్రం లోగో ఆవిష్క‌ర‌ణ మా చేతుల మీదుగా చేయ‌డం ఆనందంగా ఉంది. దాదాపు 30 మందిని కొత్త వారిని తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ రూపొందుతోన్న ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.

చిత్ర‌ నిర్మాత ఏలూరి సూర్య కుమారి మాట్లాడుతూ..``సినిమా రంగంపై ఆస‌క్తితో తొలిసారిగా నిర్మాత‌గా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి  కొత్త వారిని హీరో హీరోయిన్స్ గా ప‌రిచ‌యం చేస్తూ ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. మా యూనిట్ స‌హ‌కారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్న విధంగా సినిమా వ‌స్తోంది `` అన్నారు.  ద‌ర్శ‌కుడు ఆప‌తి ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ ``ల‌వ్ అండ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశం ఇది. ప్ర‌స్తుత యువత న‌డ‌త ఎలా ఉంది? అనేది చూపిస్తూ అంత‌ర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాం`` అన్నారు.

Advertisement
Advertisement
Advertisement