ఒక దోవ దొరుకుతుంది

ABN , First Publish Date - 2021-08-02T10:00:11+05:30 IST

ఒక దోవ దొరుకుతుంది కాసేపు పడుకో....

ఒక దోవ దొరుకుతుంది

ఒక

దోవ 

దొరుకుతుంది

కాసేపు పడుకో.

       ఒక దోవ దొరుకుతుంది

దుర్గమారణ్యంలో కూడా

       ఒక దోవ దొరుకుతుంది,

గూడు కట్టుకున్న చీకటిలాంటి అరణ్యంలో కూడా

సన్నని వెలుగులాంటి ఒక దోవ దొరుకుతుంది,

జీవితమే అరణ్యమైన చోట

శిథిలనగరమైన చోట

మానవుడు ఏం చేయాలి-

గుండె తీసి కాగడాలా చేత్తో పట్టుకుని నడవాలి

నిజం- మార్గం లేనిదేదీ లేదు-

నిజం- ఈ నదిని దాటడానికి

       ఒక తెడ్డు దొరుకుతుంది.

వెతకాలి, వెతుకుతూ పోవాలి

ఎప్పుడూ వెతకటమే జీవితం.

చిక్కని, అంతుచిక్కని కొండల మధ్య నడుస్తుంటాం.

వాటిని రాతివనాలని భావించు

ఏ పక్క నుంచో చంద్రరేఖ వొకటి తోస్తుంది

ఎక్కడన్నా కూర్చుని

వెతలమూట విప్పి ఒక ముద్ద తిను-

ఎప్పుడూ ఇంతేనా?

పైన చంద్రుడున్నాడు, సూర్యుడున్నాడు

ఆకాశముంది, సమస్త విశ్వముంది

కింద మానవుడున్నాడు

ఎప్పుడూ దేనికీ చెక్కుచెదరని

మానవుడున్నాడు

మార్గాంతరం వెతికే మానవుడున్నాడు

మానవ నిర్మితమైన జీవితముంది

ప్రకృతికి ప్రతీక అయిన మనిషున్నాడు-

ప్రకృతి మనిషి ఒకటే

తాటి మొవ్వులాంటి మార్గమొకటి పొడుచుకొస్తుంది


ఎదురుగా కాలవలాంటి

కాలి దోవ వొకటి కన్పడుతుంది.

‘ఓహోం ఓహోం’ అంటూ

జీవితాన్ని మోసుకుంటూ

ఊరేగించు, నలుదిశలా ఊరేగించు-

కె. శివారెడ్డి

95021 67764


Updated Date - 2021-08-02T10:00:11+05:30 IST