వారానికి ఒకసారి ఆయిలీ ఫిష్ తింటే ఏమవుతుంది..?

ABN , First Publish Date - 2022-03-17T17:51:34+05:30 IST

చికెన్‌, మటన్‌తో కంటే చేపలతో చేసిన ఆహారం ఎంతో ఆరోగ్యమే. అయితే ఆయిలీ ఫిష్‌ తింటే ఎక్కువ ప్రయోజనాలుంటాయని ఇటీవలి ఓ అధ్యయనం చెబుతోంది. స్పెయిన్‌లోని

వారానికి ఒకసారి ఆయిలీ ఫిష్ తింటే ఏమవుతుంది..?

ఆంధ్రజ్యోతి(17-03-2022)

చికెన్‌, మటన్‌తో కంటే చేపలతో చేసిన ఆహారం ఎంతో ఆరోగ్యమే. అయితే ఆయిలీ ఫిష్‌ తింటే ఎక్కువ ప్రయోజనాలుంటాయని ఇటీవలి ఓ అధ్యయనం చెబుతోంది. స్పెయిన్‌లోని ఓ యూనివర్శిటీ చేసిన ఓ పరిశోధన సారాంశం ఇది. సాల్మన్‌, సార్డెన్స్‌లాటి ఆయిలీ ఫిష్‌లు తింటే అందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. వారానికి ఒకసారి రెండు వందల గ్రాముల చొప్పున తింటే జీవితకాలం ఐదేళ్లు పెరుగుతుందని చెబుతోంది ఈ తాజా అధ్యయనం.


నూనెశాతం అధికంగా ఉండే సాల్మన్‌ లాంటి చేపల్లో విటమిన్‌ బి, డి లతో పాటు సెలేనియమ్‌ ఉంటుంది. తరచుగా ఈ చేపలను తింటే గుండెసమస్యలు, మతిమరుపు సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. డిప్రెషన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. చిన్నపిల్లలు, గర్భిణిలు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. సాల్మన్‌ ఫిష్‌ లాంటివి తినలేని వాళ్లు.. పల్లీలు, అవిసెగింజలు, చియా విత్తనాలు, సోయాబీన్స్‌ తింటే సరి. వీటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి.

Updated Date - 2022-03-17T17:51:34+05:30 IST