Abn logo
Sep 26 2021 @ 00:36AM

ఘాట్‌రోడ్డులో ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

ఘాట్‌రోడ్డులో బోల్తా కొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌


అనంతగిరి, సెప్టెంబరు 25: అనంతగిరి-అరకులోయ ఘాట్‌రోడ్డులో శనివారం సాయంత్రం బీసుపురం సమీపంలో ఇండియన్‌ ఆయిల్‌కు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా కొట్టింది. దీంతో రోడ్డుపై డీజిల్‌ వరదలా ప్రవహించింది. విశాఖపట్నం నుంచి అరకులోయ వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ బీసుపురం సమీపంలో మలుపు వద్ద వేగంగా తిప్పడంతో బోల్తా కొట్టింది. డీజిల్‌ రోడ్డుపై పడడంతో అగ్నిప్రమాదం సంభవిస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు.