రష్యా హెచ్చరికల మధ్య... ఏడు శాతం పెరిగిన చమురు ధర

ABN , First Publish Date - 2022-03-18T23:49:38+05:30 IST

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1427 జీఎంటీ నాటికి బ్యారెల్‌కు $7.47, లేదా... 7.6 % పెరిగి, $105.49 కు చేరుకుంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ బ్యారెల్‌కు $ 6.85, లేదా... 7.2 % పెరిగి, $ 101.89 కు చేరుకుంది.

రష్యా హెచ్చరికల మధ్య...  ఏడు శాతం పెరిగిన చమురు ధర

ముంబై : బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1427 జీఎంటీ నాటికి బ్యారెల్‌కు $7.47, లేదా... 7.6 % పెరిగి, $105.49 కు చేరుకుంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ బ్యారెల్‌కు $ 6.85, లేదా... 7.2 % పెరిగి, $ 101.89 కు  చేరుకుంది. అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) రోజుకు మూడు మిలియన్ బ్యారెల్స్(బీపీడీ) రష్యన్ చమురు  ఉత్పత్తులను వచ్చే నెల నుండి మూసివేయవచ్చని, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించినప్పటికీ... చమురు ధరలు నిన్న( గురువారం) 7 % పైగా పెరిగాయి.


అధిక ఇంధన ధరల కారణంగా ఒక మిలియన్ బీపీడీ డిమాండ్ తగ్గడం కంటే సరఫరా నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని ఐఈఏ మొన్న(బుధవారం)  ఒక నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1427 జీఎంటీ నాటికి బ్యారెల్‌కు $7.47,  లేదా... 7.6 % పెరిగి, $105.49కి చేరుకుంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 6.85, లేదా...  7.2 % పెరిగి, $ 101.89 కు చేరుకుంది. మోర్గాన్ స్టాన్లీ తన బ్రెంట్ ధర అంచనాను మూడవ త్రైమాసికంలో $ 20 పెంచి బ్యారెల్‌కు $ 120 కు పెంచింది, ఏప్రిల్ నుండి రష్యన్ ఉత్పత్తి సుమారు... ఒక మిలియన్ బీపీడీ తగ్గుతుందని అంచనా వేసింది. గత వారం యూఎస్ క్రూడ్ ఇన్వెంటరీలు 4.3 మిలియన్ బ్యారెళ్ళు  పెరిగాయని ప్రభుత్వ డేటా వెల్లడించిన నేపథ్యంలో...  ధరలు మునుపటి సెషన్‌లో క్షీణించాయి.

Updated Date - 2022-03-18T23:49:38+05:30 IST