జిడ్డు లేని మేకప్‌

ABN , First Publish Date - 2022-08-20T05:37:21+05:30 IST

వానల్లో తడిస్తే, మేకప్‌ మొత్తం చెల్లాచెదరవుతోందా? తేమకు చెదిరిపోకుండా, రోజంతా మేకప్‌ తాజాగా ఉండాలంటే, కొన్ని చిట్కాలు పాటించాలి.

జిడ్డు లేని మేకప్‌

బ్లష్‌: ఈ కాలంలో పౌడర్‌ బ్లష్‌లకు బదులుగా జెల్‌ బ్లష్‌ వాడుకోవాలి.


వానల్లో తడిస్తే, మేకప్‌ మొత్తం చెల్లాచెదరవుతోందా? తేమకు చెదిరిపోకుండా, రోజంతా మేకప్‌ తాజాగా ఉండాలంటే, కొన్ని చిట్కాలు పాటించాలి. 


మాయిశ్చరైజర్‌: పగటివేళ ఆయిల్‌ ఫ్రీ మాయిశ్చరైజర్‌ మాత్రమే ఉపయోగించాలి. ముఖం జిడ్డుగా మారకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. 

సన్‌ ప్రొటెక్షన్‌: వానాకాలం కదా అని సన్‌స్ర్కీన్‌ మానుకోకూడదు. ఈ కాలంలో కూడా 30 కంటే ఎక్కువ ఎస్‌పిఎఫ్‌ ఉన్న సన్‌స్ర్కీన్‌ వాడుకోవాలి. మాయిశ్చరైజర్‌ అప్లై చేసిన తర్వాత సన్‌స్ర్కీన్‌, ఫౌండేషన్‌ సరైన ఛాయిస్‌.

ప్రైమర్‌: మేకప్‌ వన్నె తగ్గకుండా ఉండాలంటే ప్రైమర్‌ కూడా తప్పనిసరిగా వాడాలి. ముడతలను కనపడనివ్వకుండా చేసే ప్రైమర్‌తో యంగర్‌ లుక్‌ వస్తుంది.

తక్కువ మేకప్‌: ముఖం మీద మేకప్‌ ముద్దలు కట్టకుండా, గీతలు పడకుండా ఉండాలంటే, ఈ కాలంలో వీలైనంత తక్కువ మేకప్‌ వేసుకోవాలి. తప్పనిసరి అయితే టింటెడ్‌ మాయిశ్చరైజర్‌, కన్‌సీలర్లను ఉపయోగించుకోవచ్చు. 

బ్రాంజర్‌: కళ్లు ఆకర్షణీయంగా కనిపించాలంటే బ్రాంజర్‌ వాడుకోవాలి. తాజాగా, సహజసిద్ధ సౌందర్యంతో మెరిసిపోవాలంటే నుదురు, చీక్‌ బోన్స్‌, చుబుకం, ముక్కు మీద బ్రాంజర్‌ అప్లై చేయాలి. ఈ కాలంలో క్రీమ్‌ రూపంలోని బ్రాంజర్లనే ఎంచుకోవాలి.

షిమ్మర్‌ వద్దు: అవసరానికి మించిన మెరుపులు ఈ కాలంలో ఎబ్బెట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో షిమ్మర్‌ను వాడకపోవడమే మంచిది.

లిప్‌స్టిక్‌: ముదురు రంగు లిప్‌స్టిక్‌లకు బదులుగా హాయిగొలిపే లేత గులాబీ, లేత నారింజ రంగులను ఎంచుకోవాలి.

Updated Date - 2022-08-20T05:37:21+05:30 IST