వంట గ్యాస్‌... బాదుడే బాదుడు!

ABN , First Publish Date - 2021-03-02T08:45:06+05:30 IST

వంట గ్యాస్‌ వినియోగదారుల నడ్డివిరిచేలా చమురు సంస్థలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగుసార్లు సిలిండర్‌ ధర పెరగటంతో

వంట గ్యాస్‌... బాదుడే బాదుడు!

మళ్లీ గ్యాస్‌ బాదుడు 

సిలిండర్‌పై మరోసారి రూ.25 పెంపు

నెల రోజుల్లో నాలుగుసార్లు పెరిగిన ధర

మూడు నెలల్లో ఏకంగా రూ.225 పెంపు

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్‌ వినియోగదారుల నడ్డివిరిచేలా చమురు సంస్థలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగుసార్లు సిలిండర్‌ ధర పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సిలిండర్‌ ధర మరో రూ.25 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.846.50 నుంచి రూ.871.50కి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకపోవడంతో వినియోగదారులు మొత్తం ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఫిబ్రవరిలో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా రూ.100 పెరిగింది. మార్చి ఒకటిన పెరిగిన ధరతో ఇది రూ.125కు చేరింది. 

Updated Date - 2021-03-02T08:45:06+05:30 IST