Abn logo
Sep 28 2021 @ 21:06PM

ఒహాయో డేటన్ హిందూ దేవాలయంలో వైభవంగా రుద్ర, చండీ హోమాలు

ఒహాయో బీవర్‌క్రీక్ హిందూ దేవాలయంలో సెప్టెంబర్ 17 నుండి 19 వరకు ప్రపంచ శక్తి దినోత్సవం పురస్కరించుకుని లోకక్షేమం కోసం మహా రుద్రం, శత చండీ హోమాలు ఘనంగా జరిగింది. జీ ఆర్ డీ అయ్యర్ గురుకూల్ వ్యవస్థాపకులు శ్రీరమేష్ నటరాజన్, గాయత్రి నటరాజన్ ఆధ్వరంలో ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కన్నుల విందుగా, శ్రవణానందంగా సాగింది.  మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గోని హోమాలు, పూజలు చేయటం విశేషం.

శ్రీ గాయత్రి నటరాజన్ మాట్లాడుతూ..  "యావత్ జగత్తుకి కేంద్ర బిందువైన దేవిని శక్తి రూపంలో పూజించడం ఈ ప్రపంచ శక్తిదినోత్సవం ముఖ్య ఉద్దేశం. గతంలో సహస్ర సువాసిని పూజ, శత చండీ హోమం, ఆన్‌లైన్ ద్విసహస్ర చండీపారాయణం గురుకుల్ నిర్వహించినట్లు, ఈ సంవత్సరం డేటన్ దేవాలయం వారి సమన్వయంతో ఒక పండుగగా చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. 1331 మార్లు రుద్రం, 121 చమకములు, మహన్యాసం, రుద్ర క్రమం, 100 మార్లుశ్రీ దుర్గా సప్తశతి, 134 రుద్ర హోమాలు, 10 చండీ హోమాలు, హర హర మహాదేవ , జై చండీ నినాదాలతో మారుమోగిన ప్రాంగణం దివ్యానుభూతి కలిగించింది. ఇందుకు ఎంతో శ్రమించిన గురుకుల్ సభ్యులు, ముఖ్యంగా మహిళా సభ్యులు పాల్గొనటం గర్వకారణంగా ఉంది. గురుకుల్ సభ్యులందరి తరపున డేటన్ హిందూ దేవాలయ నిర్వహణ వర్గం వారికీ, కార్యవర్గ సభ్యులకు, హాజరైన భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇక ముందు కూడా గురుకుల్ ఇలాంటి కార్యాక్రమాలు ఇతర దేశాలలో కూడా జరుపుకుంటుంది’’ అని పేర్కొన్నారు. 

డేటన్ హిందూ దేవాలయం ప్రెసిడెంట్ శ్రీమతి హేమ పండ్రంగి మాట్లాడుతూ "డేటన్ హిందూ దేవాలయం 1976 నుంచీ బేవర్‌క్రీక్ పరిసర ప్రాంతాలలో హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఒక శక్తి కేంద్రంగా రూపుదిద్దుకుంది.. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము’’ అని తెలిపారు. ప్రపంచ శక్తి దినోత్సవం ఈ ఆలయ ప్రాంగణంలో ..శ్రీ రమేష్ , శ్రీమతి గాయత్రి, వారి శిష్యబృందము అద్భుత మంత్రోచ్ఛారణ, హోమాలతో ఆలయాన్ని  భక్త జనులను ఉత్తేజ పరచడం మరచిపోలేని అనుభూతి’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా జరుపుకోడానికి సహకరించిన తన తోటి కార్య వర్గం, వాలంటీర్లు, దాతలు, కళాకారులు, ఆలయ సిబ్బంది అండగా నిలిచిన భక్తులకు విశేష కృతజ్ఞతలు తెలిపారు. 

తాజా వార్తలుమరిన్ని...