Afghanistan: దౌత్యకార్యాలయాన్ని మూసేయలేదు..భారత్ స్పష్టీకరణ!

ABN , First Publish Date - 2021-07-11T19:51:58+05:30 IST

అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లోగల భారత దౌత్య కార్యాలయాన్ని మూసివేయలేదని భారత్ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది.

Afghanistan: దౌత్యకార్యాలయాన్ని మూసేయలేదు..భారత్ స్పష్టీకరణ!

కాబూల్: అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లోగల తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేయలేదని భారత ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. అక్కడి భారతీయ సిబ్బందిని స్వదేశానికి తరలించడమనేది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. కాందహార్ చుట్టుపక్కల తాలిబన్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో 50 మంది దౌత్యకార్యాలయ సిబ్బందిని, ఇతర భద్రతా సిబ్బందిని కేంద్రం శనివారం నాడు వెనక్కు పిలిపించిన విషయం తెలిసిందే. ఇది కేవలం సిబ్బంది క్షేమం కోసం తీసుకున్న ఓ తాత్కాలిక నిర్ణయమని అరిందమ్ పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సిబ్బందితో దౌత్య కార్యాలయం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వీసాల జారీ, ఇతర దౌత్య సేవలు యథాతథంగా కొనసాగేందుకు ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆయన తెలిపారు. భారత్‌కు అఫ్గానిస్థాన్ ముఖ్య దౌత్య భాగస్వామి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-11T19:51:58+05:30 IST