మాయదార్లపల్లికి అధికారులు

ABN , First Publish Date - 2022-09-25T05:21:47+05:30 IST

మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విలీన సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డీఈవో శామ్యూల్‌ తెలిపారు.

మాయదార్లపల్లికి అధికారులు

 కుందుర్పి, సెప్టెంబరు 24: మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విలీన సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డీఈవో శామ్యూల్‌ తెలిపారు. ‘మావయ్యా.. విలీనాన్ని ఆపయ్యా..’ అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఆర్డీవో నిషాంత్‌రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ జ్యోతి, తహసీల్దారు బాలకిషన్‌, ఎంఈవో ఓబుళపతితో కలిసి పాఠశాలను డీఈఓ సందర్శించారు. పాఠశాల వద్దకు అధికారులు రాగానే తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. 68 రోజుల క్రితం మూసిన పాఠశాల గేటును తెరిచేందుకు నిరాకరించారు. పాఠశాల విలీనాన్ని ఆపాలని కోరు. దీంతో స్పందించిన డీఈవో, విలీనం కార ణంగా విద్యార్థులు సుమారు 7 కి.మీ. వెళ్లేందుకు ఇబ్బంది పడతారని అంగీకరించారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించేందుకు గేటుకు వేసిన తాళాన్ని తీయాలని కోరారు. కానీ గ్రామస్థులు అంగీకరించలేదు. దీంతో దొడ్డిదారిన అధికారులు పాఠశాలలోకి వెళ్లి పరిశీలించారు.  

Updated Date - 2022-09-25T05:21:47+05:30 IST