గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించిన అధికారులు

ABN , First Publish Date - 2022-07-05T07:05:13+05:30 IST

సింహాద్రినాథుడు కొలువుదీరిన సింహగిరి ప్రదక్షిణ ఈనెల 12న జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సోమవారం మార్గాన్ని పరిశీలించారు.

గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించిన అధికారులు
నడక మార్గంలో సమస్యలపై చర్చిస్తున్న ఈవో, ఇతర శాఖల అధికారులు

సింహాచలం, జూలై 4: సింహాద్రినాథుడు కొలువుదీరిన సింహగిరి ప్రదక్షిణ ఈనెల 12న జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సోమవారం మార్గాన్ని పరిశీలించారు. రెండేళ్ల విరామం తర్వాత ఉత్సవం జరుగుతుండడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎం.వి.సూర్యకళ సారధ్యంలో దేవస్థానం ట్రస్టీ బృందం ప్రత్యేక వాహనాల్లో ప్రదక్షిణ మార్గం 32 కిలోమీటర్లు కలియతిరిగారు.


స్టాల్స్‌, మరుగుదొడ్లు, ట్రాఫిక్‌, అప్పన్న పుష్పరథం ప్రయాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌, ఇంజనీర్లు శ్రీహరి, సుధాకర్‌, వేణుగోపాల్‌, ఏసీపీలు పెంటారావు, కుమారస్వామి, అన్నిమాపక అధికారులు, సీఐలు, దేవస్థానం పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.


మెట్ల మార్గాన్ని పరిశీలించిన ఈవో

గిరిప్రదక్షిణ నేపథ్యంలో సింహగిరి మెట్ల మార్గాన్ని సోమవారం ఈవో ఎం.వి.సూర్యకళ సోమవారం పరిశీలించారు. అవసరమైన చోట్ల మరమ్మతులు జరపాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఈఎస్‌  డి.జి.శ్రీనివాసరావు, డీఈఈ బి.రాంబాబు ఉన్నారు.  

Updated Date - 2022-07-05T07:05:13+05:30 IST