Kuwait: కువైత్‌లో పెరిగిన నెలవారీ జీతాలు.. ప్రవాసులకు ఎంత పెరిగిందంటే..

ABN , First Publish Date - 2022-10-04T14:54:20+05:30 IST

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే దేశ పౌరులు, ప్రవాసుల వేతనాలకు సంబంధించిన అధికారిక డేటా తాజాగా విడుదలైంది.

Kuwait: కువైత్‌లో పెరిగిన నెలవారీ జీతాలు.. ప్రవాసులకు ఎంత పెరిగిందంటే..

కువైత్ సిటీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే దేశ పౌరులు, ప్రవాసుల వేతనాలకు సంబంధించిన అధికారిక డేటా తాజాగా విడుదలైంది. దీని ప్రకారం గడిచిన ఆరు నెలల్లో కువైత్ పౌరులతో పాటు వలసదారులకు జీతాలు పెరిగాయి. అయితే, కువైటీలకు నెలవారీ వేతాలు సరాసరిగా 22 కువైటీ దినార్లు(రూ. 5,795) పెరిగితే.. ప్రవాసులకు 5 కేడీలు (రూ. 1,317) మాత్రమే పెరిగింది. గతేడాది డిసెంబర్ నాటికి కువైత్ పౌరులకు సరాసరి నెలవారీ వేతనాలు 1,491 కువైటీ దినార్లు (రూ. 3,92,766) ఉండగా.. 2022 జూన్ నాటికి 1,513 కేడీలకు (రూ. 3,98,561) పెరిగింది. 


ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల పరంగా చూసుకుంటే.. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే కువైటీలకు 2021 డిసెంబర్‌లో నెలవారీ సరాసరి జీతం 1539 దినార్లు (4,05,410)గా ఉంటే.. 2022 జూన్ నాటికి 1,555 దినార్ల(రూ. 4,09,625)కు పెరిగింది. అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసే కువైత్ పౌరులకు 2021 డిసెంబర్‌లో 1,255 దినార్లు(3,30,597)గా ఉన్న యావరేజ్ నెలవారీ జీతం.. 2022 జూన్ నాటికి 1,297 దినార్ల(రూ. 3,41,661)కు చేరింది. అటు ఆ దేశంలో పనిచేస్తున్న ప్రవాసులకు నెలవారీ సరాసరి వేతనం 2021 డిసెంబర్ వరకు 338 దినార్లు (రూ.89,037)గా ఉంటే.. 2022 జూన్ నాటికి 343 దినార్ల (రూ. 90,354)కు పెరిగింది.   

Updated Date - 2022-10-04T14:54:20+05:30 IST