Abn logo
Mar 4 2021 @ 00:02AM

నిర్వాసిత గ్రామాల్లో అధికారుల బృందం పర్యటన

కుక్కునూరు, మార్చి 3 : పోలవరం నిర్వాసిత గ్రామాల్లో బుధవారం అధికారుల బృందం పర్యటించింది. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూర్‌ లెవెల్‌ల్లో ముంపునకు గురవుతున్న గ్రామాలను తరలించడానికి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తొంది. ఈక్రమంలో ప్రస్తుతం 41.15 కాంటూర్‌ లెవెల్‌ల్లో తరలించే గ్రామాలను, 45.72 కాంటూర్‌ లెవెల్‌ల్లో ఉన్న గ్రామాల్లో అధికారుల బృందం పర్యటించింది. దాచారం, కిష్టారం, చీరవల్లి, మర్రిపాడు, దామరచర్ల, ఉప్పేరు నిర్వాసిత గ్రామాలతో పాటు నిర్వాసితులకు నిర్మిస్తున్న పునరావాస కేంద్రాలను వారు సందర్శించారు. గతేడాది ఏఏ గ్రామాలు గోదావరి ముంపునకు గురయ్యాయో కూడా వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ బృందం సభ్యులు, వేప్‌కాస్‌ లిమిటెడ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఎస్‌కే పట్నాయక్‌, ఇరిగేషన్‌ డీఈ రమణ, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement