కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : ఆర్డీవో

ABN , First Publish Date - 2021-04-13T03:45:11+05:30 IST

పట్టణంలో కరోనా రెండో దశ విస్తరణ కారణంగా వ్యాపారస్తులు, ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆర్డీవో జీ. శ్రీనివాసులు పేర్కొన్నారు.

కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : ఆర్డీవో
కొవిడ్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

కావలి, ఏప్రిల్‌ 12: పట్టణంలో కరోనా రెండో దశ విస్తరణ కారణంగా వ్యాపారస్తులు, ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆర్డీవో జీ. శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణంలోని ట్రంకురోడ్డులోని వ్యాపార కూడలిలో సోమవారం సాయంత్రం ఆర్డీవోతోపాటు, మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డి, ఒకటో పట్టణ సీఐ కే.శ్రీనివాసరావు, కొవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ కర్నాటి రోహిత్‌ తదితరులు పర్యటించారు. నిబంధనలను పాటించని 10 దుకాణదారులకు ఒక్కో దుకాణానికి రూ.1000 వంతున అపరాధ రుసుము విధించారు. కొవిడ్‌ నిబంధనలను పాటించని వ్యాపారస్థులకు తొలుత అపరాధ రుసుం విధించినా మార్పు రాకపోతే వారి వ్యాపార లైసెన్స్‌ను రద్దు చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-04-13T03:45:11+05:30 IST