బతికుండగానే చంపేశారు కథనానికి అధికారుల స్పందన

ABN , First Publish Date - 2021-07-24T04:02:23+05:30 IST

జిల్లాలోని పరిగిలో "బతికుండగానే చంపేశారు" అని ఏబీఎన్ ఛానల్‌లో ప్రసారమైన

బతికుండగానే చంపేశారు కథనానికి అధికారుల స్పందన

వికారాబాద్: జిల్లాలోని పరిగిలో "బతికుండగానే చంపేశారు" అని ఏబీఎన్ ఛానల్‌లో ప్రసారమైన వార్తా కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. కుల్కచర్ల మండలం వ్యవసాయ విస్తరణాధికారి  సత్తాను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రమ్మ అనే మహిళ బతికుండగానే నకిలీ పత్రాలతో రైతుభీమాను గ్రామ రైతుబంధు కో ఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి పొందాడు. రైతుబంధు ద్వారా 5 లక్షలను రాఘవేంద్ర రెడ్డి తీసుకున్నాడు.


ఎలాంటి పరిశీలన లేకుండా అధికారులు సంతకాలు పెట్టారు. జరిగిన ఘటనపై వ్యవసాయ అధికారులను బాధితురాలి కుమారుడు బాలయ్య ఆశ్రయించాడు. ఈ ఘటనపై ఏబీఎన్ కథనాలను ప్రసారం చేసింది. దీంతో అధికారులు విచారణ మొదలు పెట్టారు. కుల్కచర్ల మండలం వ్యవసాయ విస్తరణాధికారి సత్తాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. విచారణ కొనసాగుతోంది. 


Updated Date - 2021-07-24T04:02:23+05:30 IST