గ్రావెల్‌ అక్రమ తవ్వకంపై కదిలిన యంత్రాంగం

ABN , First Publish Date - 2021-05-14T06:03:00+05:30 IST

అద్దంకి కొండను అక్రమా ర్కులు పీల్చి పిప్పిచేస్తున్న నేపథ్యంలో మైనింగ్‌ అధికారులు కదిలారు. ఇటీవల కాలంలో ఈ కొండ నుంచి పెద్దఎత్తున గ్రావెల్‌ అక్రమంగా తరలిస్తుం డడంపై ఆంథ్రజ్యోతిలో ఇటీవల వసరు కథనాలు ప్రచురితం కావటం, రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారు లు దాడులు చేసి ఎక్స్‌కవేటర్‌, టిప్పర్‌లు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఆ సామగ్రిని మైనింగ్‌ అ ధికారులకు అప్పగించటంతో వారు రంగంలోకి ది గారు.

గ్రావెల్‌ అక్రమ తవ్వకంపై కదిలిన యంత్రాంగం
గ్రావెల్‌ తరలించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

అద్దంకి కొండను పరిశీలించిన మైనింగ్‌ అధికారులు


అద్దంకి, మే 13 : అద్దంకి కొండను అక్రమా ర్కులు పీల్చి పిప్పిచేస్తున్న నేపథ్యంలో మైనింగ్‌ అధికారులు కదిలారు. ఇటీవల కాలంలో ఈ కొండ నుంచి పెద్దఎత్తున గ్రావెల్‌ అక్రమంగా తరలిస్తుం డడంపై ఆంథ్రజ్యోతిలో ఇటీవల వసరు కథనాలు ప్రచురితం కావటం, రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారు లు దాడులు చేసి ఎక్స్‌కవేటర్‌, టిప్పర్‌లు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఆ సామగ్రిని మైనింగ్‌ అ ధికారులకు అప్పగించటంతో వారు రంగంలోకి ది గారు. గురువారం అద్దంకి కొండ వద్ద గ్రావెల్‌ అక్ర మంగా తరలించిన ప్రాంతాలను పరిశీలించారు. ఎంత మేర గ్రావెల్‌ తవ్వి తరలించారో కొలతలు వే శారు. అది అక్రమమని తేలితే పెద్ద మొత్తంలో అ పరాధ రుసుం విధించే అవకాశం ఉంది. ఈ కార్య క్రమంలో మైనింగ్‌ సర్వేయర్‌ రవితేజ, టెక్నికల్‌ అ సిస్టెంట్‌ కృష్ణారెడ్డి, వీఆర్వో బాషా ఉన్నారు. పూ ర్తిస్థాయి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు మైనింగ్‌ అధికారులు చెప్పారు. అద్దంకి కొండ నుంచి కొంతకాలంగా పెద్దఎత్తున గ్రావెల్‌ తరలింపు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తు తం మైనింగ్‌ అధికారులు ఎలా వ్యవహరిస్తారన్నదే కీలకం. కొండ నుంచి అక్రమంగా తరలిపోయిన గ్రావెల్‌ మొత్తాన్ని లెక్కిస్తారా లేక  ఇటీవల కాలం లో తరలించిన గ్రావెల్‌ను మాత్రమే లెక్కిస్తారా అ న్న విషయం చర్చనీయాంశంగా  మారింది. గ్రావె ల్‌ తరలించిన అక్రమార్కులను గుర్తించటంలో అ ధికారులు ఎలా వ్యవహరిస్తారో అన్న విషయంపై కూడా చర్చ సాగుతోంది. మైనింగ్‌ అధికారులు  అ పరాధ రుసుం విధించనున్న నేపథ్యంలో ఇకనైనా గ్రావెల్‌ అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడుతుం దని పలువురు భావిస్తున్నారు.


Updated Date - 2021-05-14T06:03:00+05:30 IST