ఖాళీల కార్యాలయం

ABN , First Publish Date - 2021-12-06T06:16:17+05:30 IST

ప్యాపిలి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రధాన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.

ఖాళీల కార్యాలయం

ప్యాపిలి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రధాన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్‌ మారుతి ఏడాది క్రితం హొళగుందకు బదిలీపై వెళ్లారు. ఏడాదిన్నర క్రితం సీనియర్‌ అసిస్టెంటు మధు డిప్యూటీ తహసీల్దారుగా కర్నూలుకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు ఉండగా ఒకరు మాత్రమే పని చేస్తున్నారు. ఇంకొకరు డిప్యుటేషన్‌పై కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌ఐ మాత్రమే పని చేస్తున్నారు. ప్రధానమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

- ప్యాపిలి

Updated Date - 2021-12-06T06:16:17+05:30 IST