Abn logo
Mar 27 2020 @ 04:36AM

ప్రజలారా.. తీరు మార్చుకోండి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్నా ఇంటిపట్టునే ఉండకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజలపై ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ విరుచుకుపడ్డాడు. ‘పోలీసులను చూసి మన వైఖరి మార్చుకోవాలి. వారంతా మన కోసం జీవితాలను పణంగా పెడుతున్నారనే విషయం మర్చిపోవద్దు. వారికి కూడా కుటుంబాలున్నా దేశం కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ మనమెందుకు ఇంట్లోనే ఉండలేకపోతున్నాం. రేపటి భవిష్యత్‌ కోసం విజ్ఞతతో ప్రవర్తించండి’ అని భజ్జీ ట్వీట్‌ చేశాడు.


Advertisement
Advertisement
Advertisement