వీధి కుక్కలకు కొత్త దంపతుల ట్రీట్

ABN , First Publish Date - 2020-10-15T16:24:40+05:30 IST

పెళ్లి సందర్భంగా నూతన దంపతులు 500 వీధి కుక్కలకు విందు భోజనం పెట్టిన వింత ఘటన....

వీధి కుక్కలకు కొత్త దంపతుల ట్రీట్

పెళ్లి సందర్భంగా 500 వీధికుక్కలకు విందు 

భువనేశ్వర్ (ఒడిశా) : పెళ్లి సందర్భంగా నూతన దంపతులు 500 వీధి కుక్కలకు విందు భోజనం పెట్టిన వింత ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో వెలుగుచూసింది. యురేకా ఆప్టా, జోవన్నా వాంగ్‌లు సెప్టెంబరు 25వతేదీన భువనేశ్వర్ నగరంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం నూతన దంపతులు యానిమల్ వెల్ఫేర్ ట్రస్టు ఎకమ్రా అనే జంతు సంరక్షణ  సంస్థతో కలిసి 500 వీధి కుక్కలకు విందు భోజనం పెట్టారు. ఈ కొత్త జంట తమ పెళ్లి సందర్భంగా వీధి కుక్కలకు ఆహారం పెట్టడంతో పాటు జంతు సంరక్షణ ట్రస్టుకు విరాళం అందించారు.‘‘మా వివాహం అనంతరం మేం ఏదైనా మంచి పనిచేసి సమాజానికి తోడ్పడాలని అనుకొని వీధికుక్కలకు భోజనం పెట్టాం’’ అని వధూవరులు యురేకా ఆప్టా, జోవన్నా వాంగ్‌లు చెప్పారు. 


 ఇలా వీధికుక్కలకు భోజనం పెట్టడం తమకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని వారు పేర్కొన్నారు. నూతన వరుడు యురేకా ఆప్టా చిత్ర నిర్మాత కాగా భార్యజోనా దంత వైద్యురాలు. వీరి వివాహం భువనేశ్వర్ సమీపంలోని నువాగాన్ అనే గ్రామంలోని ఆలయంలో వివాహం చేసుకున్నారు.


లాక్ డౌన్ సమయంలోనూ వీరు వీధి కుక్కలకు ఆహారం పెట్టారు. తాము ఆలయంలో సాధారణ వివాహం చేసుకున్న  తర్వాత 500 వీధికుక్కలకు భోజనం పెట్టామని వధూవరులు చెప్పారు.

Updated Date - 2020-10-15T16:24:40+05:30 IST