వీధి జీవాల కోసం రూ.54 లక్షలు.. ఒడిషా ప్రభుత్వం నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-01T02:22:59+05:30 IST

వీధి కుక్కలు, పిల్లులు వంటి జంతువులకు ఆహారాన్ని అందించేందుకుగానూ ఒడిషా ప్రభుత్వం రూ.54 లక్షల నిధులను...

వీధి జీవాల కోసం రూ.54 లక్షలు.. ఒడిషా ప్రభుత్వం నిర్ణయం

భువనేశ్వర్: వీధి కుక్కలు, పిల్లులు వంటి జంతువులకు ఆహారాన్ని అందించేందుకుగానూ ఒడిషా ప్రభుత్వం రూ.54 లక్షల నిధులను విడుదల చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న వీటికి ఈ నిధులతో ఆహారాన్ని అందించే విధంగా కార్పొరేషన్ స్థాయిలో చర్యలు చేపట్టనున్నారు. ఈ మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా 5 కార్పొరేషన్‌లు, 48 మున్సిపాలిటీలకు ఈ నిధులు చేరతాయి.


ఇదిలా ఉంటే జంతువులకు ఆహారం అందించేందుకు ప్రాంతాల వారీగా నిధుల విడుదల జరగనుంది. రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్‌ మున్సిపాల్ కార్పొరేషన్‌కు ప్రతి రోజూ రూ.20,000 అందనున్నాయి. అలాగే కటక్, బెర్హంపూర్, రూర్కెలా, సంబల్‌పూర్ వంటి మేజర్ పట్టణ ప్రాంతాలకు రూ.10,000 చొప్పున, మిగిలిన మున్సిపాలిటీలన్నింటికీ రూ.5000 చొప్పున నిధులు అందనున్నాయి.

Updated Date - 2020-04-01T02:22:59+05:30 IST