Abn logo
Jun 30 2020 @ 23:24PM

ఒడిశాలోని ఈ 10 జిల్లాల్లో వీకెండ్ షట్‌డౌన్ అమలు

భువనేశ్వర్: ఒడిశాలో కరోనా కట్టడి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వారాంతాల్లో పూర్తి స్థాయి షట్‌డౌన్‌ను విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని గంజాం, గజపతి, ఖుర్దా, కటక్, జజ్‌పూర్, జగత్‌సింగ్‌పూర్, బాలాసోర్, మయుర్‌భంజ్, కియోన్జ్‌హర్, ఝార్‌సుగుడ జిల్లాల్లో వారాంతపు షట్‌డౌన్ అమలవుతుందని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తెలిపింది. ఒడిశాలో ఉన్న మొత్తం 30 జిల్లాలను పరిశీలిస్తే ఈ 10 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో.. కట్టడి దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.


ఇదిలా ఉంటే.. ఒడిశాలో కరోనా నుంచి కోలుకుని మంగళవారం 243 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. ఒడిశాలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5189కి చేరింది. ఒడిశాలో మొత్తం ఇప్పటివరకూ 7,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 1844 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరణాల సంఖ్య 25కు చేరింది.

Advertisement
Advertisement
Advertisement