కింగ్‌కోబ్రాపై గ్రామస్తుల దాడి.. అడ్డుకున్న వైద్యులు.. దానికి ఎలాంటి వైద్యం చేశారంటే..

ABN , First Publish Date - 2022-01-01T21:56:03+05:30 IST

మనుషులకే సక్రమంగా వైద్యం చేయని ఈ రోజుల్లో, ఒడిశా వైద్యులు పాముకు వైద్యం చేసి.. తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అది కూడా మామూలు పాము కాదు..12 అడుగుల అత్యంత విషపూరితమైన కింగ్‌కోబ్రా..

కింగ్‌కోబ్రాపై గ్రామస్తుల దాడి.. అడ్డుకున్న వైద్యులు.. దానికి ఎలాంటి వైద్యం చేశారంటే..

మనుషులకే సక్రమంగా వైద్యం చేయని ఈ రోజుల్లో, ఒడిశా వైద్యులు పాముకు వైద్యం చేసి.. తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అది కూడా మామూలు పాము కాదు..12 అడుగుల అత్యంత విషపూరితమైన కింగ్‌కోబ్రా. దాని ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. రాళ్లతో కొట్టి చంపబోతున్న గ్రామస్తుల నుంచి కోబ్రాను కాపాడారు. అనంతరం దానికి వైద్యం అందించిన విధానంపై పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే...


ఒడిశాలో వైద్యులు అంత్యంత అరుదైన ఆపరేషన్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిలికా అనే గ్రామంలోకి 12అడుగుల కింగ్‌కోబ్రా ప్రవేశించింది. దాన్ని చూడగానే ప్రజలు హడలెత్తిపోయారు. వారిపైకి అది బుసలు కొడుతూ రావడంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కొందరు ఇళ్ల పైనుంచి కోబ్రాపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అది తీవ్రంగా గాయపడింది. అనంతరం దాన్ని చంపేసే క్రమంలో విషయం తెలుసుకున్న వైద్యులు.. గ్రామస్తులను అడ్డుకున్నారు. పామును పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆ కుక్కంటే యజమానికి చాలా ఇష్టం.. ఇంట్లో ఉంచుకోవద్దన్న తల్లి.. కుక్కను వదిలి ఉండలేక చివరకు..


కోబ్రా తల భాగాన్ని ఓ పైపులో పెట్టి.. ముందుగా దానికి ఎక్స్‌రే తీశారు. పాము పక్కటెములు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. వెటర్నరీ సర్జన్ అండ్ రేడియాలజిస్ట్ ప్రొఫెసర్ ఇంద్రమణినాథ్‌ ఆధ్వర్యంలో కింగ్‌ కోబ్రాకు ఆపరేషన్ చేశారు. ఎముకలు దెబ్బతిన్న ప్రదేశంలో మూడు అంగుళాల మందం కలిగిన పీవీసీ పైప్‌, బ్యాండేజ్ తదితరాలతో కట్టు కట్టారు. సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి, ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కోబ్రా కోలుకునే వరకూ.. వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుందని, అనంతరం కోబ్రాను అటవీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా దభేల్ మని శబ్ధం.. అద్దం పగలడంతో అంతా ఆశలు వదులుకున్నారు.. అయితే..

Updated Date - 2022-01-01T21:56:03+05:30 IST