Olympics: స్పాన్సర్లు లేని హాకీ టీంను ఆదుకుంది ఆ ముఖ్యమంత్రే!

ABN , First Publish Date - 2021-08-06T02:40:52+05:30 IST

సహారా ఇండియా 2018లో పక్కకు తప్పుకోవడంలో పెద్ద సమస్యే వచ్చిపడింది. ఆ సమయంలో..నేనున్నానంటూ ముందుకు వచ్చారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.

Olympics: స్పాన్సర్లు లేని హాకీ టీంను ఆదుకుంది ఆ ముఖ్యమంత్రే!

న్యూఢిల్లీ: భారత్‌కు బంగారు పతకాలు అందించిన చరిత్ర మన హాకీ టీంది. కానీ..గత నలభై ఏళ్లలో ఈ క్రీడ ప్రాభవం మసకబారింది. ఒకానొక సమయంలో భారత్ హాకీ టీంకు స్పాన్సర్లు లేక ఇబ్బంది తలెత్తింది. అప్పటివరకూ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సహారా ఇండియా 2018లో పక్కకు తప్పుకోవడంతో పెద్ద సమస్యే వచ్చిపడింది. ఆ సమయంలో..నేనున్నానంటూ ముందుకు వచ్చారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఐదేళ్లకుగాను హాకీ ఇండియా టీంకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు అంగీకరించిన పట్నాయక్ ప్రభుత్వం రూ. 100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎంగా నవీన్ పట్నాయక్ చూపిన చొరవే నేటి పతకాల పంటకు బాటలు వేసింది. 

Updated Date - 2021-08-06T02:40:52+05:30 IST