Odisha: ఒడిశాలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. సీఎం నవీన్ పట్నాయక్ నయా టీం ఇదే..

ABN , First Publish Date - 2022-06-05T21:51:02+05:30 IST

ఒడిశా ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో..

Odisha: ఒడిశాలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. సీఎం నవీన్ పట్నాయక్ నయా టీం ఇదే..

భువనేశ్వర్: ఒడిశా ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో ఆదివారం కొత్త కేబినెట్ కొలువుదీరింది. మొత్తం 21 మంది కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 13 మంది కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన మంత్రులు కాగా, 8 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేసిన పాత మంత్రుల్లో 9 మందిని మళ్లీ తన కేబినెట్‌లోకి నవీన్ పట్నాయక్ తీసుకోవడం గమనార్హం. 11 మందిని రాజీనామాలకే పరిమితం చేశారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ‘Mission 2024’ను దృష్టిలో ఉంచుకుని నవీన్ పట్నాయక్ మంత్రివర్గాన్ని పునరువ్యవస్థీకరించారు. ఆరోసారి కూడా ‘బిజు జనతా దళ్’ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నవీన్ పట్నాయక్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.


కొత్త కేబినెట్‌లోకి ఆయన తీసుకున్న మంత్రుల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కులం, మతం, యువత, అనుభవం ఉన్న మంత్రుల కలయికతో, సామాజిక సమీకరణాలతో కొత్త కేబినెట్‌ను నవీన్ పట్నాయక్ పట్టాలెక్కించారు. గతంలో ఇద్దరు మహిళా మంత్రులు ఆయన కేబినెట్‌లో ఉంటే తాజాగా ఐదుగురు మహిళలకు మంత్రులుగా నవీన్ పట్నాయక్ అవకాశమిచ్చారు. గత మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా ఉన్న జగన్నాథ్ సరక, అశోక్ చంద్ర పాండాకు ఈసారి కేబినెట్ ర్యాంకు మంత్రులుగా పదోన్నతి లభించింది. కొత్త కేబినెట్‌లో కొలువుదీరిన మంత్రులు, వారికి కేటాయించిన శాఖల జాబితా ఇదే.



Updated Date - 2022-06-05T21:51:02+05:30 IST