Abn logo
Oct 1 2020 @ 01:10AM

థియేటర్లలో తమ కొత్త చిత్రాలతో వన్డేలు, టెస్ట్‌ మ్యాచ్‌ల తరహాలో

Kaakateeya

థియేటర్లలో తమ కొత్త చిత్రాలతో వన్డేలు, టెస్ట్‌ మ్యాచ్‌ల తరహాలో లాంగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాలని ఆశపడిన కథానాయకులకు ట్వంటీట్వంటీ అవకాశమే ఇవ్వలేదు. మొదటి మూడు నెలల తర్వాత అనూహ్యంగా వర్షం వల్ల ఆటను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినట్టు... కరోనా వల్ల చిత్ర పరిశ్రమలో చిత్రాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. బాలీవుడ్‌లోనూ బడా బడా కథానాయకులు నటించిన చిత్రాలూ వాయిదా పడ్డాయి. అందులో కొన్ని ఓటీటీలోకి వస్తున్నాయ్‌! మరికొన్ని చిత్రాలను థియేటర్లలోకి తీసుకురావడానికి కథానాయకులు, దర్శకులు, నిర్మాతలు సిద్ధమవుతున్నారు. అందరూ పండగలకు వచ్చే సెలవుల మీద కన్నేశారు. వచ్చే ఏడాది... 2021లో దాదాపుగా ప్రతి పండక్కి ఓ స్టార్‌ హీరో సినిమాతో వస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement