5 నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు

ABN , First Publish Date - 2022-10-20T17:54:30+05:30 IST

వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు వచ్చే నెల ఐదు నుంచి నిర్వహించనున్నా రు. చిన్నవెంకన్న ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికలను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయ ణ గురువారం ఆవిష్కరించారు.

5 నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు
కల్యాణ పత్రికలను ఆవిష్కరిస్తున్న మంత్రి కొట్టు, తదితరులు

స్వామి వారి ఆహ్వానపత్రిక ఆవిష్కరణ

 ద్వారకా తిరుమల, సెప్టెం బరు 29 : వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు వచ్చే నెల ఐదు నుంచి నిర్వహించనున్నా రు. చిన్నవెంకన్న ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికలను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయ ణ గురువారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్‌వీ నివృతరావు, ఈవో వేండ్ర త్రినాథరావు ఆహ్వాన పత్రికను అందజేసి కల్యాణ మహోత్సవాలను వీక్షించేందుకు రావాలని ఆహ్వానించారు. కల్యాణోత్సవాల్లో భాగంగా వచ్చేనెల 5న ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడి గాను, పెండ్లికుమార్తెలుగాను చేస్తారు. 6న ధ్వజారోహణ, 8న ఎదుర్కోలు ఉత్సవం, 9న రాత్రి 8 గంటలకు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. 10న రాత్రి ఏడు గంటలకు రథోత్సవం, 11న శ్రీచక్రవార్యు త్సవం, ధ్వజావ రోహణ, 12న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవు తాయన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు పీవీఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాధాచార్యులు పాల్గొన్నారు.

విజయవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు 

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవ స్థానంలో అమ్మవారి దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల శ్రీవారి దేవ స్థానం అక్కడి అమ్మవారికి పట్టువస్త్రాలను గురు వారం అందజేశారు. శ్రీవారి దేవస్థానం అనువం శిక ధర్మకర్త ఎస్‌వీ నివృతరావు, ఈవో వేండ్ర త్రినాఽథరావు, అర్చకులు అమ్మవారిని దర్శించి పట్టువస్త్రాలను విజయవాడ దేవస్థానం ఈవో భ్రమరాంబకు అందించారు. 

Updated Date - 2022-10-20T17:54:30+05:30 IST