ఓసీఐ, పీఐఓ కార్డుదారులకు భారత ప్రభుత్వం తీపి కబురు!

ABN , First Publish Date - 2020-10-22T20:38:59+05:30 IST

భారతదేశానికి రావాలనుకునే ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా), పీఐఓ (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) కార్డుదారులకు, వీదేశీ పౌరులకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది

ఓసీఐ, పీఐఓ కార్డుదారులకు భారత ప్రభుత్వం తీపి కబురు!

న్యూఢిల్లీ: భారతదేశానికి రావాలనుకునే ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా), పీఐఓ (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) కార్డుదారులకు, వీదేశీ పౌరులకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఓసీఐ, పీఐఓ, విదేశీ పౌరులు ఇండియాకు రావడానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రకనట విడుదల చేసింది. గతంలో లాగే ఇండియాకు రాకపోకలు సాగించొచ్చని పేర్కొంది. అయితే టూరిస్ట్ వీసాలపై భారత్‌కు రావాడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతేకాకుండా విదేశాల నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులు కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. 


కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టి.. పలు దేశాలతో ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం కుదుర్చుకుంటూ అంతర్జాతీయ విమానాలను దేశంలోకి అనుమతిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా కారణంగా ప్రయాణికులపై విధించిన ఆంక్షలను కూడా ప్రభుత్వం సడలించింది. 


Updated Date - 2020-10-22T20:38:59+05:30 IST