ఓసీఐ కార్డుదారులకు శుభవార్త చెప్పిన భారత ప్రభుత్వం!

ABN , First Publish Date - 2020-08-08T03:19:02+05:30 IST

ఓసీఐ (ఓవర్సిస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో విదేశీ

ఓసీఐ కార్డుదారులకు శుభవార్త చెప్పిన భారత ప్రభుత్వం!

న్యూఢిల్లీ: ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో నివసిస్తున్న ఓసీఐ కార్డు దారులు భారత్‌కు రావడానికి మార్గం సుగమం అయింది. ఆయా దేశాల్లో ఉన్న ఓసీఐ కార్డు దారులను భారత్‌లోకి అనుమతించనున్నట్లు భారత హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా.. భారతీయ పౌరులు కూడా ఏ రకమైన వీసాతోనైనా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది.  


Updated Date - 2020-08-08T03:19:02+05:30 IST