ప్రభుత్వ భూమినే కబ్జా చేస్తున్నారు: గోనుగుంట్ల

ABN , First Publish Date - 2022-05-29T06:18:39+05:30 IST

పట్టణంలో ప్రభుత్వ భూమిని సైతం వదలకుండా కబ్జా లకు పాల్పడుతున్నారని, ఇందుకు సహక రించిన అధికారులపై హైకో ర్టుకు వెళ్తామని మాజీ ఎమ్మెల్యే గోను గుంట్ల సూర్యనా రాయణ పేర్కొన్నారు.

ప్రభుత్వ భూమినే కబ్జా చేస్తున్నారు: గోనుగుంట్ల
ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల



ధర్మవరం, మే 28: పట్టణంలో ప్రభుత్వ భూమిని సైతం వదలకుండా కబ్జా లకు పాల్పడుతున్నారని, ఇందుకు సహక రించిన అధికారులపై హైకో ర్టుకు వెళ్తామని మాజీ ఎమ్మెల్యే గోను గుంట్ల సూర్యనా రాయణ పేర్కొన్నారు. పట్టణంలోని పుట్ట పర్తి రహదారిలోగల అరిగెలపోతన్న రైసు మిల్‌ సమీపంలో ఆక్రమణకు గురైన స్థలా న్ని ఆయన పరిశీలించారు. అత్యంత విలు వైన ఆర్‌అండ్‌బీకి సంబంధించి 92 సెంట్లను స్థానిక ప్రజాప్రతినిధి ఆక్రమించారన్నారు.  పక్కనే ఆయనకు, ఆయన అనుచరులకు ఉన్న స్థలాలకు ధరలు రావాలన్న ఉద్దేశ్యంతో దీనిని ఆక్రమించి రోడ్డు మాదిరి వేశారని ఆరోపించారు. ఇక్కడ సెంటు స్థలం రూ.40లక్షలు పలుకు తోందన్నారు. ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు ఇందుకు వత్తాసు పలుకుతు న్నారన్నారు. మూడేళ్లుగా విచ్చలవిడిగా మార్నింగ్‌ వాక్‌ పేరుతో దౌర్జన్యాలు చేసి చాలా మంది భూములు లాక్కొని అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్ప టికే నియోజకవర్గంలో దాదాపు రూ.1000 కోట్లదాకా అవినీతికి పాల్పడ్డా రన్నారు. ఆయన అక్రమించుకున్న భూములను కొన్న వారు కూడా తీవ్ర ఇ బ్బందులకు గురవుతారన్నారు. ఆయన అవినీతిని 15 రోజులకొకసారి  బయ టకు తీస్తాం, మళ్లీ తాము అధికారంలోకి వస్తామన్నారు.  అధికారంలోకి వచ్చి న తరువాత ముఖ్యమంత్రి ఆదేశాలతో కబ్జాలు, దౌర్జన్యాలు చేసి సంపాదిం చిన వాటిపై డీఎస్పీ, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి, బాధితులకు న్యా యం జరిగే విధంగా చర్యలుతీసుకుంటామన్నారు. జగన్మోహనరెడ్డితో పాటు ఐఏఎస్‌ అధికారులు ఎలా జైలుకు వెళ్లారో ఈ నియోజకవర్గంలోని అధికారు లూ జైలుకు వెళ్లే పరిస్థితులు ఉంటాయన్నారు.

భాకరా పేట బాధితులకు ఆర్థిక సాయం

 తిరుపతి భాకరాపేట వద్ద మార్చి 26 వ తేదీన జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన బాధితులకు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ శనివారం ఆర్థిక సాయం అందజేశారు.  బస్సు ప్రమాదం జరిగిన సమయం లో ప్రకటించిన మేరకు... ఆయన  ఏడుగురు మృతుల కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున మొత్తం రూ.3.50లక్షలు, గాయపడిన 19మందికి రూ.10వేలు చొప్పున రూ. 1.90లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఆర్థిక సాయం అందించి పరామర్శించారు. మొత్తం రూ.5,40లక్షలు అందజేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న  ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈకార్యక్రమంలో నాయకులు పామిశెట్టి శివశంకర్‌,రాజు, చిగిచెర్ల అరవిందరెడ్డి, పరమేశ, గొట్లూరుచంద్ర తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-05-29T06:18:39+05:30 IST